News May 14, 2024
అమలాపురంలో యువకుడిపై కత్తితో దాడి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మొబార్లీపేట జంక్షన్ వద్ద మంగళవారం ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. దుండగులు యువకుడిని కత్తితో నరికి, నాప రాయితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొనఊపిరితో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
సకాలంలో ఇంటి పనులు చెల్లించాలి: కలెక్టర్ కీర్తి చేకూరి

జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.64.07 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News March 6, 2026
తూ.గో: టెన్త్ విద్యార్థులకు GOOD NEWS

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని డీపీటీఓ మూర్తి తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. తూ.గో జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 6, 2026
టెన్త్ పరీక్షలకు 24,538 మంది విద్యార్థులు: కలెక్టర్

తూ.గో జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు 138 కేంద్రాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రతిరోజూ ఉ.9.30 గంటల నుంచి మ.12.45 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 24,538 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందులో రెగ్యులర్ అభ్యర్థులు 13,322 మంది, ప్రైవేట్ అభ్యర్థులు 11,216 మంది ఉన్నారన్నారు.


