News May 14, 2024
మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారు: అంబటి

జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారన్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే అది పాజిటివ్ ఓటింగ్ అని, మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారన్నారు. మహిళలంతా సీఎం జగన్‌కే ఓటు వేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి అన్నారు.
Similar News
News March 20, 2026
GNT: చిన్న శివలింగం వెనుక పెద్ద కథ.. లోకేశ్ వివరణ

పూజ గదిలో ఉన్న బొమ్మలపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ Xలో స్పందించారు. నాలుగేళ్ల వయసులో తన కుమారుడు దేవాన్ష్ తయారు చేసిన శివుడి బొమ్మ, చిన్న శివలింగాన్ని జ్ఞాపకంగా పూజా గదిలో ఉంచినట్లు తెలిపారు. చిన్న వయసులోనే శివ భక్తుడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. భక్తి అనేది కొందరికి అర్థమవుతుందని, మరికొందరికి కాదని, అలాంటి భక్తికి వివరణ అవసరం లేదని పేర్కొన్నారు.
News March 20, 2026
గుంటూరులో ప్రత్యేక డ్రైవ్.. రూ.5.36 లక్షల జరిమానా

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డులో పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై గురువారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 922 వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల భద్రత పెంచడం ప్రధాన లక్ష్యం అని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News March 19, 2026
గుంటూరులో 8 మంది అధికారులపై వేటు

GNT నగరపాలక సంస్థలో అక్రమ కట్టడాలకు సహకరించిన 8 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. శారద, వెంకటరావమ్మ, రిజ్వానా, మల్లికార్జున, సురేఖ, హరిజానాయక్, అశోక్ కుమార్, సత్యనారాయణలపై AP సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


