News May 14, 2024
లక్ష 30వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం: జీవన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఉత్తర భారత దేశంలో ఉనికి కోల్పోతుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. నిజామాబాద్‌లో లక్ష 30 వేల మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 23, 2025
NZB: కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ శివారులోని నాగారం తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల బాలుర-1లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సయ్యద్ హైదర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాల కోసం ప్రస్తుతం10వ తరగతి చదువుతున్న ముస్లీం, క్రిస్టియన్, సిక్కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
News January 23, 2025
ధర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్
ధర్పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గణా జ్యోతి రాణిని బుధవారం సస్పెండ్ చేస్తూ ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జ్యోతి రాణి ధర్పల్లి పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఆమె విపరీత ప్రవర్తనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె చేస్తున్న అవకతవకలపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీఈవో, కలెక్టర్కు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News January 22, 2025
NZB: ముసాయిదా జాబితా మాత్రమే: కలెక్టర్
గ్రామసభల్లో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలో పలు మండలాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అనర్హులు ఉంటే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.