News May 14, 2024
ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన MLC కవిత జుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈనెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన 8 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ చేపడతామని జడ్జి చెప్పారు. కాగా ఇప్పటికే CBI కేసులో కవితకు కోర్టు ఈనెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
Similar News
News January 12, 2025
దేశంలో 17 HMPV కేసులు
భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన <<15087157>>HMPV <<>> కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్ర 3, కర్ణాటక 2, తమిళనాడు 2, కోల్‌కతా 3, అస్సాం 1, పుదుచ్చేరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. రేపటి నుంచి యూపీలో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఈ కేసులు పెరుగుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి దీనిని గుర్తించినట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 12, 2025
బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటాం: విజయవాడ సీపీ
AP: కోడి పందేల శిబిరాలను డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ తెలిపారు. శిబిరాల వద్ద బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటామన్నారు. కోళ్లకు కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాట, పేకాట, క్యాసినోలు జరగనివ్వమని చెప్పారు. సంక్రాంతి అంటే కోడి పందేలు, జూదం, గుండాట, క్యాసినో కాదని అన్నారు. సంప్రదాయ ఆటలు ఆడుతూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
News January 12, 2025
BJP దూకుడు: మహిళలకు పగ్గాలిచ్చేందుకు రెడీ
డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలయ్యే సరికి మహిళా నాయకత్వాన్ని పెంచుకొనేందుకు BJP కసరత్తు ఆరంభించింది. బూత్ లెవల్ నుంచి నేషనల్ వరకు పార్టీ పగ్గాలను సముచిత స్థాయిలో వారికే అప్పగించనుందని తెలిసింది. నడ్డా స్థానంలో BJPకి కొత్త ప్రెసిడెంట్ వచ్చేలోపు states, dists, mandals, village స్థాయుల్లో 30% వరకు స్త్రీలకే బాధ్యతలు అప్పగించనుంది. MPని మోడల్ స్టేట్‌గా ఎంచుకుంది. 2026 నుంచి విమెన్ రిజర్వేషన్లు అమలవుతాయి.