News May 14, 2024

భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం: లక్ష్మణ్

image

TG: రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలవిగాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని, గ్యారంటీల అమలు కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

Similar News

News February 10, 2026

ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్‌ ద్వారానే

image

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్‌ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

News February 10, 2026

చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే..

image

చామంతి సాగులో కొన్ని సార్లు పువ్వుల పరిమాణం మరీ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రైతులకు ఆశించిన ధర రాదు. చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే.. మొక్కల తలల కత్తిరింపు చేపట్టిన తర్వాత 20 నుంచి 25 రోజులకు లీటరు నీటిలో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీ గ్రాములను) కలిపి పిచికారీ చేయాలని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.

News February 10, 2026

మరోసారి తెరపైకి మైసూర్ సోప్, తమన్నా వివాదం

image

మైసూర్ శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. KN ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేసే సబ్బుకు ముంబైలో పుట్టిన తమన్నాను రూ.6.2 కోట్ల కాంట్రాక్ట్‌కు నియమించడం కాంగ్రెస్ నాయకుల యాంటీ కన్నడ మైండ్‌సెట్‌‌కు నిదర్శనమని బీజేపీ ఎంపీ కె.సుధాకర్ ఆరోపించారు. 2025, మేలో ఓకే అయిన ఈ కాంట్రాక్ట్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.