News May 14, 2024
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా 11 మంది అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలురులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇద్దరు టీడీపీ ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా 11 మందిపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 10, 2025
కడప జిల్లా పోలీసు శాఖకు నూతన జాగీలం

జిల్లా పోలీసు శాఖకు నూతన జాగిలం సోనును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం నూతన జాగీలాన్ని పరిశీలించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ జాగీలం వచ్చిందని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధన, పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిందన్నారు. బిల్జియం మల నాయిస్ జాతికి చెందిన జాగీలమని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచనలు చేశారు.
News September 10, 2025
కడప జిల్లాలో పలువురు పోలీస్ సిబ్బంది బదిలీ

కడప జిల్లాలో 44 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తక్షణం ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మరో 11 మంది సిబ్బందిని వివిధ చోట్ల అటాచ్ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు ASIలు, HCలు, PCలు, WPCలు ఉన్నారు.
News September 10, 2025
కడప మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు

కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 17న హాజరుకావాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ నోటీసులు పంపారు. ఇదే చివరి అవకాశం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్ట్ పనులు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కోర్టు నోటీసులు జారీ చేసింది.