News May 14, 2024
IPL: వీరిలో బెస్ట్ ఓపెనింగ్ పెయిర్ ఏది?
IPL: క్రికెట్ అభిమానులకు ఆసక్తికర పజిల్. ఈ ఏడాది IPLలో ఓపెనర్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మెక్‌గుర్క్, సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, గిల్, కేఎల్ రాహుల్, జైస్వాల్, డుప్లెసిస్, రోహిత్ శర్మ రాణించారు. మరి వీరిలో బెస్ట్ ఓపెనింగ్ జోడీని ఎంచుకోండి. కింద కామెంట్ చేయండి.
Similar News
News January 10, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్
టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.
News January 10, 2025
రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: సీఎం చంద్రబాబు
AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని వివరించారు.
News January 10, 2025
సినిమాల స్పెషల్ షోలకు అనుమతిపై పునః సమీక్షించండి: హైకోర్టు
TG: సినిమాల ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతినివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘గేమ్ ఛేంజర్’ టికెట్ల ధరలు, స్పెషల్ షోలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోలకు అనుమతులివ్వడం ఏంటని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునః సమీక్షించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.