News May 14, 2024
జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతోంది: డీఎస్పీ
జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతోందని DSP టీడీ.యస్వంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో YCP MLA అభ్యర్థి సుధీర్ రెడ్డికి, కూటమి MLA అభ్యర్థి ఆది నారాయణ రెడ్డికి, MP అభ్యర్థికి భూపేశ్ రెడ్డికి 2+2 గన్ మ్యాన్లతో భద్రతను పెంచారు. ఇప్పటికే ఇద్దరు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగులో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
Similar News
News January 16, 2025
కడప: ఇక పట్నం పోదాం..!
ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.
News January 16, 2025
తిరుమలలో కడప బాలుడి మృతి
తిరుమలలో కడప బాలుడు చనిపోయాడు. చిన్నచౌక్ ఏరియాకు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు 13వ తేదీన తిరుపతికి వెళ్లారు. వాళ్లకు 16వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించారు. ఈక్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం వారి రెండో కుమారుడు సాత్విక్ శ్రీనివాస్ రాజు(3) ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
News January 15, 2025
యర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి
యర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.