News May 14, 2024

ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం రూ.1.41 లక్షల కోట్లు

image

ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా లాభాల బాట పడుతున్నాయి. 2023-24లో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.1.41 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. 2022-23లో రూ.1.04 లక్షల కోట్ల ఆదాయం రాగా, ఈసారి 35 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో SBI వాటా 40 శాతం(రూ.61,077 కోట్లు) ఉంది. PNB రూ.8,245 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.2,549 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.

Similar News

News January 10, 2025

టీమ్ ఇండియా టార్గెట్ 239 రన్స్

image

భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.

News January 10, 2025

గాయపడిన హీరోయిన్ రష్మిక!

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయం అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. పుష్ప-2 సినిమా విజయం తర్వాత ఆమె సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో నటిస్తున్నారు. చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుండగా రష్మిక గాయపడటం గమనార్హం. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని రష్మిక అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News January 10, 2025

బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ ట్రైలర్‌ను ఇవాళ సా.5:53 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్‌ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.