News May 14, 2024
మెదక్: EVMలలో అభ్యర్థుల భవిష్యత్తు !

నెల రోజులుగా కొనసాగిన పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం సోమవారం పోలింగ్ ప్రక్రియతో ముగిసింది. ఇక పోలింగ్ అయిపోయిన వెంటనే అభ్యర్థులు తమ కార్యకర్తలతో సమావేశమై కూడికలు తీసివేతలతో విజయావకాశాలకు బేరీజు వేసుకుంటున్నారు. EVMలలో నిక్షిప్తమై ఉన్న వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాలకు వస్తున్నారు. మెదక్‌లో 74.38%, జహీరీబాద్‌లో 74.54% ఓటింగ్ జరగ్గా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 19, 2026
మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 19, 2026
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.