News May 14, 2024
సర్వేపల్లి స్ట్రాంగ్ రూమ్‌కు సీల్

సర్వేపల్లి నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పకడ్బందీ భద్రత మధ్య నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్ వేశారు.
Similar News
News March 13, 2026
కావలి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.


