News May 14, 2024
నల్గొండ: పిడుగుపడి యువకుడి మృతి

నల్గొండ జిల్లాలో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. త్రిపురారం మండలం నీలాయగూడెంలో యువకులు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. వారంతా చెట్టుకిందికి వెళ్లగా పిడుగుపడింది. దీంతో ఓ యువకుడు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
Similar News
News March 27, 2026
NLG: వేసవిలో విద్యుత్ కష్టాలకు చెక్.. ‘పవర్’ ఫుల్ ప్లాన్

వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా నల్గొండ జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. లోడ్ తట్టుకునేందుకు సబ్‌స్టేషన్లలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచారు.
News March 27, 2026
NLG: రేపు జాతీయ లోక్ అదాలత్…

లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెండింగ్, ప్రీలిటిగేషన్ కేసుల పరిష్కారానికి శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నల్గొండ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ (పూర్తి అదనపు బాధ్యతలు) పురుషోత్తంరావు ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 27, 2026
నల్గొండ: ‘దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రేపు ప్రజవాణి’

దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 28న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బాధితులు నేరుగా కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


