News May 14, 2024
సంగారెడ్డి: కాంగ్రెస్‌లోకి BRS, BJP ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు BRS నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, BJP నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, త్వరలో వారు చేరనున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఆగస్టులో సంక్షోభం తప్పదని BJP ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి ఈరోజు కౌంటర్ ఇచ్చారు. HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPపై మండిపడ్డారు.
Similar News
News March 3, 2026
మెదక్: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
News March 3, 2026
మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.
News March 2, 2026
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు


