News May 14, 2024
హింసను అరికట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘తిరుపతిలో పులివర్తి నానిపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేశారు. మాచర్ల, తాడిపత్రిలోనూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈసీ, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.

ఉత్కంఠ పోరు.. భారత్ విజయం

T20WC: నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్ ఇండియా 20 ఓవర్లలో 193/6 రన్స్ చేయగా నెదర్లాండ్స్ 176/7 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 18 రన్స్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటారు. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.