News May 14, 2024

అద్భుతం.. మనసులో అనుకుంటే డీకోడ్ చేస్తుంది

image

వైద్య రంగంలో మరో అద్భుతాన్ని సైంటిస్టులు ఆవిష్కరించారు. మనిషి ఆలోచనలను 79% కచ్చితత్వంతో డీకోడ్ చేశారు. ఇందుకోసం T&C చెన్ బ్రెయిన్ మిషన్‌ను కాల్టెక్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో సహాయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా ఇద్దరు వ్యక్తుల బ్రెయిన్‌లో చిన్న డివైజ్‌లను అమర్చారు. అవి సిగ్నల్స్‌ను అర్థం చేసుకుని పదాల రూపంలోకి మార్చుతాయి.

Similar News

News February 18, 2026

హెయిర్ వాష్ 2 సార్లు చేసుకోవాలా?

image

తల స్నానం చేసినప్పుడు డబుల్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘మొదటి వాష్‌తో మురికి, ఆయిల్, చెమట, కాలుష్యంతో పేరుకుపోయిన పదార్థాలు, చుండ్రు తొలగిపోతాయి. రెండో వాష్‌తో షాంపూ మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. తల శుభ్రంగా ఉండటంతో అందులోని ప్రోటీన్లు నేరుగా చొచ్చుకెళ్తాయి. తల చర్మం, జుట్టు మరింత దృఢంగా మారుతాయి‘ అని అంటున్నారు.

News February 18, 2026

ఇంటి దేవుడిని పూజించడానికి అనువైన రోజు ఏదంటే?

image

కుజ గ్రహం, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. ఈ రోజున ఇంటి దేవుడిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు పండితులు. ‘మంగళవారం రోజున ఇలవేల్పును పూజిస్తే జాతక దోషాలు తొలగి, మనసులో ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. ఈరోజు చేసే ప్రత్యేక పూజలతో ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. కుటుంబీకులు అందరూ పూజలో పాల్గొనడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.

News February 18, 2026

మీరు ఎన్నటికీ గెలవలేరు: ఖమేనీ

image

ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నారు. ‘వారిది ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి అని US అధ్యక్షుడు చెబుతున్నారు. అలాంటి శక్తి కూడా తీవ్రంగా దెబ్బతినొచ్చు. మళ్లీ కోలుకోదు. యుద్ధనౌకలు ప్రమాదకరమే. కానీ వాటిని సముద్రం అడుగుకు పంపగల ఆయుధాలు ఇంకా ప్రమాదకరం’ అని హెచ్చరించారు. తమ అణు పరిశ్రమ దేశాన్ని నడిపించేందుకేనని, యుద్ధానికి కాదని చెప్పారు.