News May 14, 2024
TDP నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ED ఛార్జ్‌షీట్

మనీలాండరింగ్ కేసులో టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్లైట్ ఫైల్ చేసింది. కాగా.. జేసీ.ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు చెందిన వాహనాలకు నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2022లో జేసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Similar News
News March 15, 2026
కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసిస్తుందా?

సౌత్ ఇండియాపై కన్నేసిన BJP కమ్యూనిస్ట్ గడ్డ కేరళంపై జెండా ఎగురవేయాలని చూస్తోంది. పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, శబరిమల గోల్డ్ చోరీ కేసును అవకాశంగా మలుచుకుంటోంది. అటు కేరళంలో BJPని అడుగుపెట్టనివ్వబోమని విజయన్ అంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. <<19389988>>మే 4న<<>> వెలువడే ఫలితాలు కేరళం రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి..
News March 15, 2026
పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
News March 15, 2026
ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


