News May 14, 2024

స్వాతి మాలీవాల్ ఆరోపణలు నిజమే.. చర్యలు తీసుకుంటాం: AAP

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ధ్రువీకరించారు. ‘కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి ఆయన ఇంటికి వెళ్లారు. బయట డ్రాయింగ్ రూమ్‌లో వెయిట్ చేస్తుండగా ఆయన పీఏ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని సీఎం తీవ్రంగా పరిగణించారు. తగిన చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు.

Similar News

News March 18, 2026

‘PAN’ కార్డుకు అప్లై చేస్తున్నారా?

image

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం పాన్ కార్డు పొందేందుకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి PAN అప్లికేషన్ ఫామ్స్ కూడా చెల్లవని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆధార్‌పై ఉన్న పేరునే PAN కార్డుపై ముద్రిస్తారు.

News March 18, 2026

గుడ్‌న్యూస్.. 60% సీట్లపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్

image

విమాన సీట్ల సెలక్షన్ ఛార్జీల పేరుతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు చేస్తున్న అదనపు వసూళ్లకు కేంద్రం చెక్ పెట్టింది. కనీసం 60% సీట్లను ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్ లేకుండా కేటాయించాలని DGCA ఆదేశించింది. ఒకే PNRపై ప్రయాణించే కుటుంబ సభ్యులను పక్కపక్క సీట్లలోనే కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. విమానాల రద్దు, ఆలస్యం వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను లోకల్ లాంగ్వేజెస్‌లో డిస్‌ప్లే చేయాలని పేర్కొంది.

News March 18, 2026

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

image

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్‌లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్‌లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్‌లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.