News May 14, 2024
పల్నాడులో ఘర్షణలు.. రంగంలోకి ఎస్పీ!

AP: ఎన్నికల అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కారంపూడిలో ఘర్షణలు తలెత్తాయి. దీంతో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కాసేపట్లో మాచర్ల రానున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉండటంతో ఎస్పీ మాచర్లలోనే మకాం వేస్తారట. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు ఆయన అక్కడే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Similar News
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ రష్యాలో ఉన్నారా?

US, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా <<19366915>>గాయపడినట్లు <<>>వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యా మిలిటరీ విమానంలో రహస్యంగా ఆయన్ను మాస్కో తరలించారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అక్కడ విజయవంతంగా మొజ్తబాకు సర్జరీ చేసినట్లు కథనాల్లో పేర్కొంది. మరోవైపు సుప్రీంలీడర్ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News March 17, 2026
ఆస్కార్: దురదృష్టంలో ఈమెది ఆల్ టైమ్ రికార్డు!

ఆస్కార్ <<19394758>>అవార్డుల<<>> విషయంలో పాటల రచయిత డయానె వారెన్‌ది ఓ దురదృష్ట గాధ. దశాబ్దాలుగా నామినేషన్లలో ఉంటున్నా చివరికొచ్చే సరికి ఆమెకు నిరాశ తప్పడం లేదు. ఇలా ఏకంగా 17 సార్లు మొండిచెయ్యే దక్కింది. ఆస్కార్ చరిత్రలో ఇదో రికార్డు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరుసగా 9 సార్లు ఎంపికైనా అదృష్టం మాత్రం వరించలేదు. ‘నేను కొత్త రికార్డు సృష్టించా. మీరు అనుమతిస్తే మరోసారి తిరిగొస్తా’ అని FBలో వారెన్ రాసుకొచ్చారు.
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)


