News May 14, 2024

రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

image

AP: రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. <>https://aprs.apcfss.in/<<>> వెబ్‌సైట్‌లో అభ్యర్థి ID, DOB, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. APRJC పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్‌ ఫస్టియర్‌లో MPC, BiPC, MEC, CEC, EET, CGT గ్రూపుల్లో, APRDC పరీక్షలో అర్హత సాధించిన వారికి డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

Similar News

News March 14, 2026

గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్

image

AP: గిరిజనులెవరూ తనను కలిసి రోడ్లు వేయాలని అడగకపోయినా గర్భిణులు, బాలింతల కష్టాలు, డోలి మోతలు చూసి గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేస్తున్నామని Dy.CM పవన్ అన్నారు. ‘మీ MLA ఎప్పుడూ రాలేదు. మీ సమస్యలు పరిష్కరించలేదు. మీ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా వివక్ష చూపించం. 18 నెలల్లో గిరిశిఖర గ్రామాల్లో 460 KM రోడ్లు నిర్మించాం. తాగునీటి సౌకర్యం కల్పిస్తాం’ అని పాడేరు నందిగరువు పర్యటనలో అన్నారు.

News March 14, 2026

ఎన్నికలు ముగిశాయి… కేసులు మిగిలాయి

image

TG: రాష్ట్రంలో పంచాయతీ, మున్సి‘పోల్స్’ ముగిశాయి. అయితే ఈ సందర్భంగా నమోదైన కేసులు అటు విజేతలను ఇటు పరాజితులను వెంటాడుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన సహా అనేక కేసులు ఇప్పుడు వారికి తలనొప్పిగా మారుతున్నాయి. PR ఎన్నికల్లో 4246, MNP ఎలక్షన్లో 2547 కేసులు నమోదైనట్లు యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ వెల్లడించింది. అలాగే ₹4,04,37,610 నగదు, ₹9,34,61,123 విలువైన బంగారం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారంది.

News March 14, 2026

ఈ జీవికి 3 గుండెలు, 9 మెదళ్లు..!

image

సముద్ర గర్భంలో నివసించే ఆక్టోపస్‌లు ప్రకృతి వింతలకు నిలయం. వీటికి ఏకంగా మూడు గుండెలు, తొమ్మిది మెదళ్లు ఉండటం విశేషం. ప్రతి చేతికి ఒక మెదడు ఉండటం వల్ల అవి స్వతంత్రంగా పనిచేయగలవు. అంతేకాకుండా వీటి రక్తం మనలా ఎరుపు రంగులో కాకుండా నీలం రంగులో ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్‌కు బదులుగా ‘హెమోసైనిన్’ అనే రాగి ఆధారిత ప్రొటీన్ ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో