News May 14, 2024

కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?

image

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ తనకు రూ.91.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అందులో రూ.28.73 కోట్ల చర.. రూ.62.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె పేరిట ₹17.38 కోట్ల అప్పు ఉంది. అఫిడవిట్ ప్రకారం ఆమె వద్ద 6 కిలోల బంగారు, 60 కిలోల వెండి, ₹3 కోట్లు విలువచేసే వజ్రాభరణాలు ఉన్నాయి. కంగనా రనౌత్‌పై 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Similar News

News January 1, 2025

రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు

image

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్‌లో ఇవాళ్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. రైళ్ల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 1, 2025

హ్యాంగోవర్‌ సమస్యలా.. ఇలా చేయండి!

image

మందుపై దండయాత్ర చేసిన వారు ఈరోజు ఉదయమే హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడుతుంటారు. అల్లం హ్యాంగోవర్ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోండి. మంచినీటిని నెమ్మదిగా తాగండి. తగినంత నిద్రపోవాలి. నిమ్మరసంలో తేనె కలిపి తాగాలి. నువ్వుల గింజల్లో బెల్లం కలిపి తినండి. B6, B12తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ చేప తినొచ్చు. ముఖ్యంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోండి.

News January 1, 2025

SHOCKING.. ఎంత తాగావు బ్రో?

image

HYD బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో షాకింగ్ రీడింగ్ నమోదైంది. వెంగళరావు పార్క్ సమీపంలో నిన్న రాత్రి 10.50 గంటల సమయంలో బైక్(TS09EK3617)పై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అందులో 550 రీడింగ్ వచ్చింది. దీంతో రీడింగ్ చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా, ఎంత తాగావు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 30 దాటితే కేసు నమోదు చేస్తారు.