News May 14, 2024
DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ

డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ.34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాధావాన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు సీబీఐ వెల్లడించింది.
Similar News
News March 24, 2026
సుప్రీం తీర్పు సరే.. క్రైస్తవంలో చేరారని నిరూపించేదెలా?

క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు <<19462779>>తీర్పు<<>> ఇచ్చింది. అయితే బాప్టిజం సర్టిఫికెట్ లేకుండా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు నిరూపించడం ఎలాగనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే చర్చికి వెళ్లడం, పేర్లు మార్చుకోవడంతో మతం మారినట్లు చెప్పలేం. అలాంటి చట్టాలేవీ దేశంలో అమలులో లేవు. పలు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులున్నా వాటి పాత్ర పరిమితం. ఈ అంశంపై విధివిధానాల రూపకల్పన అవసరం. ఏమంటారు?
News March 24, 2026
రన్‌టైమ్‌తో పనేంటి.. కథ బాగుంటే హిట్టే!

సినిమా సక్సెస్‌కు నిడివి ముఖ్యం కాదని, ప్రేక్షకులను కట్టిపడేసే కథే ప్రధానమని యానిమల్(3:24H), పుష్ప-2(3:21), ధురంధర్ 1&2(3:40& 3:51) చిత్రాలు నిరూపించాయి. బలమైన కథతో వస్తే జనాలు బ్రహ్మరథం పడతారని ఇవి స్పష్టం చేశాయి. రొటీన్ ఫార్ములాలు కాకుండా ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో వస్తే రన్‌టైమ్ అడ్డంకి కాదని తేలిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎన్ని గంటలైనా కూర్చుంటారనడానికి వీటి వసూళ్లే సాక్ష్యం.
News March 24, 2026
యువతా.. దేశ రాజకీయం మార్చేందుకు సిద్ధమా?

రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, మహిళలకు గోల్డెన్ ఛాన్స్. నియోజకవర్గాల పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు <<19460921>>భారీగా<<>> పెరగనున్నాయి. దీంతో విస్తృత అవకాశాలు రానున్నాయి. దేశ దిశను మార్చాలనే సంకల్పం ఉన్నవారు ప్రజాక్షేత్రంలోకి దిగండి. కొత్త ఆలోచనలు, సరికొత్త భావజాలాలను ప్రజలకు పరిచయం చేసి వారి మెప్పు పొందండి. ‘నేపాల్’ను గెలిచిన Gen Z స్ఫూర్తితో ముందుకు కదలండి.


