News May 14, 2024

13 స్థానాల్లో గెలుస్తాం: రేవంత్

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో 6-7 స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌‌కు 13 స్థానాలు వస్తాయని ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్ మెరుగైందన్న సీఎం.. తమ అభ్యర్థి దానం నాగేందర్‌కు కనీసం 20వేల మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీకి 220కు పది అటో, ఇటో వస్తాయని రేవంత్ అంచనా వేశారు.

Similar News

News March 5, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 26 స్పెషలిస్ట్/ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBSతో పాటు సంబంధిత విభాగంలో MD/DNB, DM, DrNB, పీజీ డిప్లొమా, M.Ch., MS, MDS అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News March 5, 2026

4 రోజుల్లో రూ.9,560 తగ్గిన 10గ్రా.ల గోల్డ్ రేటు

image

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరింది. నాలుగు రోజుల్లోనే రూ.9,560 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పతనమై రూ.1,49,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.

News March 5, 2026

రష్మిక చెల్లిని చూశారా?

image

రష్మిక-విజయ్ రిసెప్షన్ నిన్న HYDలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి రష్మిక ఫ్యామిలీ కెమెరాల కంటపడింది. దీంతో వారి వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె చెల్లి 14ఏళ్ల షిమాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రష్మిక తన చెల్లిని పరిచయం చేస్తూ కనిపించారు. షిమాన్‌కు తనకు 15ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల ఆమెను బిడ్డలా చూసుకుంటానని గతంలో రష్మిక తెలిపారు.