News May 14, 2024
ఐదో దశ ఎన్నికలు ఎప్పుడంటే?
లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్‌తో ఎన్నికలు ముగుస్తాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
Similar News
News January 1, 2025
హ్యాంగోవర్ సమస్యలా.. ఇలా చేయండి!
మందుపై దండయాత్ర చేసిన వారు ఈరోజు ఉదయమే హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడుతుంటారు. అల్లం హ్యాంగోవర్ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోండి. మంచినీటిని నెమ్మదిగా తాగండి. తగినంత నిద్రపోవాలి. నిమ్మరసంలో తేనె కలిపి తాగాలి. నువ్వుల గింజల్లో బెల్లం కలిపి తినండి. B6, B12తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ చేప తినొచ్చు. ముఖ్యంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోండి.
News January 1, 2025
SHOCKING.. ఎంత తాగావు బ్రో?
HYD బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో షాకింగ్ రీడింగ్ నమోదైంది. వెంగళరావు పార్క్ సమీపంలో నిన్న రాత్రి 10.50 గంటల సమయంలో బైక్(TS09EK3617)పై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అందులో 550 రీడింగ్ వచ్చింది. దీంతో రీడింగ్ చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా, ఎంత తాగావు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 30 దాటితే కేసు నమోదు చేస్తారు.
News January 1, 2025
2025: తొలిరోజు స్టాక్‌మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే..
కొత్త ఏడాది తొలిరోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 78,033 (-110), నిఫ్టీ 23,597 (-50) వద్ద చలిస్తున్నాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. APOLLOHOSP, LT, ASIANPAINT, INFY, BRITANNIA టాప్ గెయినర్స్. BAJAJ AUTO, ADANI PORTS టాప్ లూజర్స్.