News May 14, 2024
ఢిల్లీతో మ్యాచ్.. LSG టార్గెట్ 209 రన్స్
LSGతో మ్యాచ్‌లో DC 20 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. అభిషేక్ పోరెల్ 58, షై హోప్ 38, పంత్ 33 పరుగులతో రాణించారు. చివర్లో స్టబ్స్ 25 బంతుల్లో 57* పరుగులతో అదరగొట్టారు. నవీన్ ఉల్ హక్ 2, రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
Similar News
News January 11, 2025
విశాల్ అనారోగ్యానికి ఆ సినిమానే కారణమా?
కోలీవుడ్ హీరో విశాల్ అనారోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘వాడు వీడు’ మూవీ షూటింగ్ సమయంలో విశాల్ చెట్టుపై నుంచి కిందపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పి, ఆకలి లేమితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల అది తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కారణంగానే ఆయన ఈ స్థితికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
News January 11, 2025
Podcast: గోద్రా అల్లర్లపై మోదీ ఏమన్నారంటే?
2002 గోద్రా అల్లర్ల సమయంలో రైలు తగలబెట్టిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని PM మోదీ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘ఘటన గురించి తెలియగానే అక్కడికి వెళ్తానని అధికారులు చెప్పా. కానీ సింగిల్ ఇంజిన్ చాపర్ మాత్రమే ఉండటంతో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. చాలాసేపు వాదించి ఏం జరిగినా నేనే బాధ్యుడినని చెప్పా. గోద్రాలో మృతదేహాలను చూసి చలించిపోయా. కానీ ఓ హోదాలో ఉన్నందున ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నా’ అని చెప్పారు.
News January 11, 2025
BREAKING: ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు.