News May 14, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

విజయవాడ మీదుగా వెళ్లే తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని రైల్వే అధికారులు మార్పులు చేశారు. ట్రాక్ నిర్వహణ కారణాల రీత్యా నం.17405 TPTY-ADB ట్రైన్‌ను ఈ నెల 16, 22 తేదీల్లో, నం.17406 ADB-TPTY ట్రైన్‌ను ఈ నెల 15, 21 తేదీల్లో విజయవాడ మీదుగా నడపమని అధికారులు తెలిపారు. విజయవాడ, మధిర, ఖమ్మం మీదుగా కాక తెనాలి, సికింద్రాబాద్ మీదుగా ఆయా తేదీల్లో ఈ రైళ్లు నడుపుతామన్నారు. 

Similar News

News March 25, 2026

సౌత్ ఇండియా ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు

image

కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే దక్షిణ భారత విశ్వవిద్యాలయాల పురుషుల ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు బుధవారం బయలుదేరింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేక రమేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, కోచ్ మనోహర్ పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

News March 25, 2026

అవనిగడ్డ నియోజకవర్గం రెండు అవుతుందా..?

image

2 లక్షలపైచిలుకు జనాభాతో 6 మండలాలతో విస్తరించి ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంపై పునర్విభజన ఎఫెక్ట్ పడనుంది. సమీప ప్రాంతాలతో కలిపి అవనిగడ్డను రెండు నియోజకవర్గాలుగా విభజించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో కలిపి చల్లపల్లి నియోజకవర్గం ఏర్పడవచ్చని, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలతో ప్రస్తుత అవనిగడ్డ నియోజకవర్గం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

News March 25, 2026

కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

image

కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం పామర్రు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.