News May 14, 2024
FINAL: ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ 76.09%

ఖమ్మం లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఖమ్మం – 62.97%, పాలేరు -83.77%, మధిర -81.84%, వైరా-81.06%, సత్తుపల్లి-80.34%, కొత్తగూడెం -69.47%, అశ్వారావుపేట- 80.95%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 76.09% శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ తరఫున వినోద్ రావు పోటీ చేశారు.
Similar News
News March 20, 2026
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
News March 20, 2026
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ డిజైన్లపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. నాబార్డ్ నిధులతో జీ+1 పద్ధతిలో తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మెటీరియల్‌తో అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని, ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
News March 20, 2026
రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్ దత్

ఖమ్మం: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.


