News May 14, 2024
భువనగిరి ఎంపీ సెగ్మెంట్ ఫైనల్ ఓటింగ్ 76.78%
భువనగిరి లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఆలేరు- 82.81%, భువనగిరి- 82.71%, ఇబ్రహీంపట్నం- 66.83%, జనగాం-74.68%, మునుగోడు- 83.71%, నకిరేకల్ -77.11%, తుంగతుర్తి- 74.06%గా ఉంది. మొత్తంగా 76.78% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఇదే టాప్. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య , బీఆర్ఎస్ నుంచి మల్లేశ్ బరిలో ఉన్నారు.
Similar News
News November 17, 2024
NLG: నెలాఖరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె SLBC కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని తనిఖీ చేశారు. టీజీ ఎస్ఎం ఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిస్థితిని వివరించారు.
News November 16, 2024
నల్గొండ: చేతికి వచ్చిన వరి పంట.. రైతుళ్లో ఆందోళన
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చింది. ఆనందంగా ఉండాల్సిన అన్నదాతలు భయంభయంగా, ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతవరణ పరిస్థితులే అందుకు కారణం. ఆరుగాళం కష్టపడి పండించిన పంట ఎక్కడ అందకుండా పోతుందేమో అనేదే వారి ఆందోళన. వర్షాలు రాకూడదని, పంట చేతికందాలని అన్నదాతులు వరుణ దేవుడని ప్రార్థిస్తున్నారు.
News November 16, 2024
NLG: జిల్లాలో 55% సర్వే పూర్తి
నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు 5,03,500 కుటుంబాలను గుర్తించారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు లక్షల గృహాల్లో ఎన్యూమరేటర్లు సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలతో పోలిస్తే నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సర్వే వేగంగా ఇప్పటికే 55 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.