News May 14, 2024

పిట్లంలో రోడ్డు ప్రమాదం

image

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిట్లంలో పోతిరెడ్డి పల్లి తండాలో మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆగి ఉన్న లారీని ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావు పల్లి గ్రామానికి చెందిన బోట్ల పండరి(29)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

Similar News

News March 16, 2026

NZB: ఇంటర్ అమ్మాయిలకు అద్భుత అవకాశం

image

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని 71 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

News March 16, 2026

నిజామాబాద్: తస్మాత్ జాగ్రత్త : సీపీ

image

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.