News May 14, 2024
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం వాజేడు ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2026
భవిత కేంద్రాల పనులు వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (దివ్యాంగులను) సాధారణ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడమే ‘భవిత’ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కొణిజర్ల మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని, చిన్నమునగాల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిత కేంద్రాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పరికరాలతో నాణ్యమైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 15, 2026
విద్యుత్ పునరుద్ధరణకు ‘ఎమర్జెన్సీ’ వాహనాలు: ఎస్ఈ

ఖమ్మం: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్’ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
News March 15, 2026
BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


