News May 14, 2024

శ్రీకాకుళం: ఎండ తీవ్రతకు అల్లాడుతున్న వేతనదారులు

image

ఉపాధి పనులు చేపడుతున్న ప్రదేశాల్లో వేతదారులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వసతుల్లేక వడదెబ్బకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల్లో ఈ ఏడాది 2,61,832 మంది ఉపాధి వేతనదారులు పనుల్లో పాల్గొంటున్నారు. వలసలు నివారించడానికి కేంద్రం ఉపాధిహామీ పథకం చేపట్టింది. పని ప్రదేశంలో చలువపందిళ్లు, గుడారాల్లాంటివి లేకపోవడంతో ఎండవేడిమి తట్టుకోలేపోతున్నామని పలువురు కూలీలు అంటున్నారు.

Similar News

News March 13, 2026

శ్రీకాకుళం జిల్లాలో మెదటి సారి కిడ్నీ మార్పిడి చికిత్స

image

పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నేడు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విశాఖకు చెందిన వైద్య బృందం చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సుమారు రూ. 12 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలు, అర్హత కలిగిన వైద్యులను నియమించి ప్రతి రోజు ఉచితంగా డయాలసిస్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో సోంపేటకు చెందిన యువతి హేమశ్రీకి మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నేడు జరగనుందని MLA శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.

News March 13, 2026

ఫైల్స్ క్లియెరెన్స్‌లో అచ్చెన్న బెస్ట్

image

పరిపాలన విభాగంలో ఫైల్స్ క్లియరెన్స్ అన్నది కీలకం. రాష్ట్ర మంత్రుల్లో మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో 3,362 ఫైల్స్‌ను క్లియర్ చేశారు. 551 గంటలు ఫైల్స్ క్లియరెన్స్‌కు సమయం తీసుకున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు.

News March 13, 2026

జలుమూరులో అగ్ని ప్రమాదం

image

జలుమూరు మండలం నామాలపేటలో గురువారం సాయంత్రం జీడీ, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రామ రైతులు ఎన్.భాస్కరరావు, ఎన్.లక్ష్మీనారాయణ, సీహెచ్ రత్నాలు, రమేశ్‌లకు చెందిన నాలుగు ఎకరాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. సుమారు ఆస్తి నష్టం రూ.50వేల వరకు ఉంటుందని సిబ్బంది అంచనా వేశారు.