News May 14, 2024
T20WC: రెండో సెమీఫైనల్‌కు నో రిజర్వ్ డే!

టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉండదని cricbuzz పేర్కొంది. వాతావరణం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే 4గంటల అదనపు సమయం కల్పించినట్లు తెలిపింది. దీని ప్రకారం.. మ్యాచ్ సాధ్యం కాకపోతే సూపర్ 8లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు ఫస్ట్ సెమీఫైనల్‌కు మరుసటి రోజున రిజర్వ్ డే కల్పించడం గమనార్హం. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 12, 2026
GOOD NEWS: వారికి 15 రోజుల సెలవులు

AP: GOVT ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందు దాదాపు 50వేల మందికి 15 రోజులు వెల్‌నెస్ లీవ్ ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే రూ.50వేల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.
News March 12, 2026
చైనాకు 1.2 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు?

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే చమురు నౌకలపై దాడి చేస్తామని బెదిరిస్తున్న ఇరాన్.. ఆ మార్గం ద్వారా వెళ్లే తన షిప్‌మెంట్స్‌ను మాత్రం ఆపలేదని తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి తమ ప్రధాన ఇంపోర్టర్ అయిన చైనాకు దాదాపు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు పంపినట్లు సమాచారం. అమెరికా/ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచడం కోసం హార్ముజ్‌ను ఆయుధంగా వాడుకుంటున్న ఇరాన్ వల్ల భారత్ సహా అనేక దేశాల చమురు నౌకలు ఆగిపోయాయి.
News March 12, 2026
X యూజర్లకు షాక్

ఇక నుంచి X (ట్విటర్)లో గ్రోక్‌ను ప్రశ్నలు అడగలేం. కేవలం ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ అందుబాటులో ఉందని X ప్రకటించింది. ప్రీమియం కోసం నెలకు రూ.230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాలి. కాగా Xలో పోస్టులపై ఏమైనా సందేహాలు ఉంటే నెటిజన్లు గ్రోక్‌ను అడిగి వాటిని నిర్ధారించుకునేవారు.


