News May 15, 2024

మోసం చేయడంలో బీజేపీ వాళ్ళకు ర్యాంక్ ఇవ్వొచ్చు: జగ్గారెడ్డి

image

మోసం చేయడంలో బీజేపీ నేతలకు మొదటి ర్యాంకు ఇవ్వవచ్చని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి ముగ్గురు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకుడు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2026

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్‌

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు

News March 2, 2026

MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.