News May 15, 2024

స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఈవీఎంలు

image

ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, ఎస్‌.కోట, గజపతినగరం నియోజకవర్గాల ఈవీఎంలను, జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం స్ట్రాంగ్ రూములకు ఎన్నికల అధికారులు సీళ్లు వేశారు.

Similar News

News March 11, 2026

VZM: మహిళతో పెళ్లికి నిరాకరణ..ఏడాది జైలు శిక్ష

image

మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడు బండి సుచిత్‌కు మహిళా కోర్టు బుధవారం ఏడాది శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. బూర్లిపేటకు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాక మొహం చాటేశాడనే మహిళ ఫిర్యాదుతో కేసును కోర్టుకు అప్పగించగా..శిక్ష ఖరారైందని విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్. గోవిందరావు మీడియాకు తెలిపారు.

News March 11, 2026

VZM: ఇన్‌స్టాగ్రామ్‌ లవ్..చివరికి జైలు పాలు

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మోసం చేసిన కేసులో కొండవెలగాడ గ్రామానికి చెందిన నిందితుడు పంది నారాయణ (24)కు పోక్సో ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానాను బుధవారం విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నెల్లిమర్ల PS‌లో నమోదైన ఈ కేసులో నేరం నిరూపితమవడంతో కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు.

News March 11, 2026

VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.