News May 15, 2024
కడపలో జూన్ 4 వరకు 144 సెక్షన్

కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి జూన్ 4వ తారీకు వరకు జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (జిల్లా కలెక్టర్) జారీ చేసిన 144 సెక్షన్ అమలులో ఉంటుందని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి, ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News March 13, 2026
కడప: వంట గ్యాస్ బ్లాక్‌లో అమ్మితే చర్యలే

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.
News March 13, 2026
ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలిగా జీవనం సాగిస్తున్నాడు.
News March 13, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు: జేసీ నిధి మీనా