News May 15, 2024
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ

ఈవీఎంలను నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద గోదాంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. అయితే వాటికి రక్షణగా మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు
Similar News
News March 12, 2026
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
News March 12, 2026
NLG: ఒంటిపూట కూడా మిడ్ డే మీల్స్

ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పనిదినం (ఏప్రిల్ 23) వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజు మాత్రమే పని చేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే రోజున మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.5 వరకు తరగతులు నడుస్తాయని DEO భిక్షపతి గురువారం తెలిపారు. ఈ సమయంలో కూడా మధ్యాహ్న భోజనం పెడతారు.
News March 12, 2026
NLG: మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో బస్సులు కేటాయించారు.


