News May 15, 2024
ఈ ప్రయాణం సాధ్యమవుతుందని అనుకున్నామా: రష్మిక
ముంబైలో ఇటీవల ప్రారంభమైన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’పై ప్రయాణించిన నటి రష్మిక తన అనుభవాన్ని పంచుకున్నారు. ముంబై నుంచి నవీ ముంబై వెళ్లేందుకు 2 గంటలు పట్టేదని, ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతోందని ఓ ఇంటర్వ్యూలో హర్షం వ్యక్తం చేశారు. ఇది సాధ్యమని ఏనాడైనా అనుకున్నామా అని ప్రశ్నించారు. భారత్ అభివృద్ధిని ఇక ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేసిన రష్మిక, ప్రజలు ప్రగతికే ఓటేయాలంటూ పిలుపునిచ్చారు.
Similar News
News January 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 6, 2025
సౌతాఫ్రికాతో టెస్ట్.. ఎదురొడ్డుతున్న పాక్
పాక్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన PAK తొలి ఇన్నింగ్స్‌లో 194 రన్స్‌కే పరిమితమైంది. ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా ఆ జట్టు బ్యాటర్లు రాణించారు. ఓపెనర్లు మసూద్ సెంచరీ(102*) చేయగా బాబర్ 81 రన్స్‌తో రాణించారు. తొలి వికెట్‌కు 205 రన్స్ జోడించారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి PAK ఇంకా 208 రన్స్ వెనుకంజలో ఉంది.
News January 6, 2025
శుభ ముహూర్తం (06-01-2025)
✒ తిథి: శుక్ల సప్తమి రా.7:03 వరకు ✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.25 వరకు ✒ శుభ సమయం: ఉ.5.46-6.22, సా.6.58-7.22 ✒ రాహుకాలం: ఉ.7.30-9.00 ✒ యమగండం: ఉ.10.30-మ.12.00 ✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34 ✒ వర్జ్యం: ఉ.6.44-8.15 ✒ అమృత ఘడియలు: సా.4.51-6.22.