News May 15, 2024

రష్మిపై నెటిజన్ల ఆగ్రహం

image

ఇటీవల ఓ పసిబిడ్డను వీధికుక్క చంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై స్పందించిన నటి రష్మి.. బిడ్డపై దాడి జరుగుతుంటే తల్లిదండ్రులేం చేస్తున్నారంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. బాధ్యత లేకపోతే పిల్లల్ని కనొద్దంటూ తేల్చిచెప్పారు. బిడ్డను వారే రిస్కులో పెట్టారని విమర్శించారు. ఇది నెట్టింట దుమారానికి దారి తీసింది. బిడ్డ చనిపోతే మీరు కుక్కను వెనుకేసుకొస్తున్నారా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

Similar News

News March 4, 2026

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $82.66కు చేరింది. అయితే ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా చూస్తామని, అవసరమైతే హార్ముజ్ జలసంధిలో నౌకలకు తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ హామీ ఇవ్వడంతో ధరల పెరుగుదల వేగం తగ్గింది. ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ధర 12% పెరిగింది. ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌కు ఇది ఆర్థికంగా భారం కానుంది.

News March 4, 2026

కూటమి హయాంలో దేవాలయాల్లో అపచారాలు: YCP MLC

image

AP: హెరిటేజ్ ఎప్పుడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదంటూ CM CBN అబద్ధాలు చెప్పారని YCP MLC చంద్రశేఖర్ మండలిలో ఆరోపించారు. ‘2014-19 మధ్య ప్రభుత్వం హెరిటేజ్ మజ్జిగ కొనుగోలు చేసింది. TDP హయాంలోనే RTC టికెట్లపై జెరూసలెం యాత్ర ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో అపచారాలు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి టికెట్ల తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో గోడకూలి ఏడుగురు మరణించారు’ అని విమర్శించారు.

News March 4, 2026

TDP Vs YCP.. మండలిలో రసాభాస

image

AP: తిరుమల లడ్డూపై చర్చ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సంబంధం లేని అంశాలు చర్చకు తెచ్చి డైవర్ట్ చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై తమ MLC చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగాన్ని TDP అడ్డుకుందంటూ YCP ఆందోళనకు దిగింది. అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామంది. దీంతో వాకౌట్ చేసి వెళ్లిపోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.