News May 15, 2024

15 నుంచి 26 వరకు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌లో భద్రతా చర్యల దృష్ట్యా ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు విశాఖపట్నం – విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) ను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. విజయవాడ – విశాఖ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) ను కూడా పై తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

Similar News

News March 13, 2026

వివాదాస్పద ఖర్చుల చెల్లింపులకూ గ్రీన్ సిగ్నల్(2/2)

image

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం రాళ్లు తరలింపు, యోగాంధ్ర కార్యక్రమంలో వినియోగించిన వీఐపీ మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు జీవీఎంసీ సమావేశంలో అంగీకరించారు. కూర్మన్నపాలెం ఎంవీవీ ఎంకే పార్కుకు నీటి సరఫరా పైపులకు రూ.46.60 లక్షలు, ట్యాంకర్ల బిల్లులకు రూ.19.20 లక్షలు, ఫాగింగ్‌కు రూ.80 లక్షలు, వీధి కుక్కల శస్త్రచికిత్సలకు రూ.45 లక్షల చెల్లించెందుకు ఆమోదం తెలిపారు.

News March 13, 2026

జీవీఎంసీ చివరి సమావేశం.. వివాదస్పద నిర్ణయాలకు ఆమోదం(1/2)

image

జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన అజెండాలోని 193 అంశాలతో పాటు టేబుల్ అజెండా కలిపి మొత్తం 294 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 293 అంశాలను సభ్యులు ఆమోదించారు. గతంలో వివాదాస్పదంగా మారి వాయిదా పడిన ప్రతిపాదనలకూ స్వల్ప చర్చతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాలుగు రోజుల్లో పాలకవర్గ గడువు ముగియనున్న నేపథ్యంలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలనూ అడ్డుకోకుండా ఆమోదించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 13, 2026

విశాఖ: బుకింగ్ చేసినా ఆలస్యంగా గ్యాస్ డెలివరీ..!

image

విశాఖలో గ్యాస్ సరఫరా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 9 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 26,000 నుంచి 30,000 సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అయితే ప్రస్తుతం రోజువారీ సరఫరా 16,000 నుంచి 19,000 సిలిండర్లకు తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో సిలిండర్ 24 గంటల్లో అందుతుండగా, ప్రస్తుతం వినియోగదారులు 7 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.