News May 15, 2024

‘వేట్టయాన్‌’ షూట్ ముగించిన రజినీకాంత్

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా వేట్టయాన్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రజినీ పాత్ర షూటింగ్ తాజాగా పూర్తయినట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విటర్‌లో ప్రకటించింది. మూవీ టీం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికినట్లు తెలిపింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి తదితర స్టార్స్ ఈ మూవీలో నటిస్తుండటం విశేషం.

Similar News

News March 3, 2026

ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA

image

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని కీలక అణు కేంద్రం ధ్వంసమైనట్లు అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ(IAEA) తెలిపింది. నటాంజ్ ఫ్యూయెల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్(FEP) పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ప్లాంట్ ప్రాంగణంలోని భవనం డ్యామేజ్ అయిందని, అయితే రేడియేషన్ లీకేజ్ జరగలేదని చెప్పింది. శాటిలైట్ ఇమేజెస్‌ ద్వారా ఈ విషయం గుర్తించామని చెప్పింది. గతేడాది <<16697751>>జూన్‌లోనూ<<>> FEPపై ఇజ్రాయెల్ దాడి చేసింది.

News March 3, 2026

రానున్న 4 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు టెంపరేచర్ 2-3 డిగ్రీలు పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 36°C-40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో 36°C కంటే టెంపరేచర్ తక్కువగా నమోదైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News March 3, 2026

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం

image

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి సరిహద్దు వెంట వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అడ్డుకోవడానికి ‘సెక్యూరిటీ జోన్’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ చేపట్టింది. దీనికి ప్రతిచర్యగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడుతోంది.