News May 15, 2024

ప్రత్యేక కమిటీలో కొల్లు రవీంద్ర

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు ఏడుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు కూడా స్థానం దక్కింది. జిల్లాకు చెందిన వర్ల రామయ్య కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

Similar News

News March 16, 2026

అమరజీవి త్యాగం తెలుగు జాతికి ఆదర్శం: అడిషనల్ ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి.వి. నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రవికిరణ్, రవి కుమార్ పాల్గొన్నారు.

News March 16, 2026

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

image

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.