News May 15, 2024

తాడిపత్రిలో యుద్ధ వాతావరణం.. భారీగా పోలీసు బలగాల మోహరింపు..!

image

తాడిపత్రిలో నిన్న 8 గంటల పాటు యుద్ధ వాతావరణం తలపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలిసి పట్టణంలో డీఐజీ షిమోషీ వాజ్ పాయ్ పర్యటించారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల కోసం మరిన్ని పోలీసు బలగాలను రప్పించారు. డీఐజీతో పాటు కర్నూలు డీఐజీ, ఎస్పీ, కడప, అన్నమయ్య, జిల్లాల ఎస్పీలు తాడిపత్రికి చేరుకున్నారు.

Similar News

News March 30, 2026

సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దాం: కలెక్టర్

image

పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా.. సోమవారం అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.

News March 29, 2026

నేడు ఎల్లనూరు మండలానికి హీరో విజయ్ దేవరకొండ రాక

image

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.