News May 15, 2024

నల్గొండ: స్వల్పంగా పెరిగిన పోలింగ్.. గెలుపు ఎవరిది…?

image

నల్గొండ MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 74.13శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 75.04 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి ఉత్తమ్(INC) 25,682 మెజార్టీతో నరసింహారెడ్డి(BRS)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

Similar News

News March 3, 2026

NLG: ‘పాలనలో వేగం పెంచాలి’.. కలెక్టర్ల సదస్సులో CM

image

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు అత్యంత కీలకంగా సాగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ పాల్గొని జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ​ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని CM ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

News March 3, 2026

దేవరకొండ హోలీ సంబరాల్లో విషాదం.. విద్యార్థి మృతి (Update)

image

దేవరకొండ ఉప్పవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తికేయన్ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. విద్యార్థి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. మరో విద్యార్థి శ్రీనివాసచారి పరిస్థితి విషమంగా ఉంది.

News March 3, 2026

NLG: రైతులకు గుడ్ న్యూస్.. ఉగాది తర్వాతే..!

image

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 4.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.