News May 15, 2024
కురువళ్లిలో వంద శాతం ఓటింగ్

కర్నూలు జిల్లాలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఆలూరు మండలం కురువళ్లి గ్రామంలోని 109 పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 940 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 460, మహిళలు 480 మంది ఉన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం తెలిపారు.
Similar News
News October 1, 2025
బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకుందాం: ఎస్పీ

బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని పటిష్ఠ చర్యలు చేపట్టిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకోవాలన్నారు. ఇప్పటికే 200 మంది ట్రబుల్ మాంగర్స్‌పై బైండోవర్ కేసులు నమోదు చేసి, 340 రింగ్ కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 800 మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు.
News October 1, 2025
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో పెన్షన్లను పంపిణీ చేశారు. అలాగే సి క్యాంపు రైతు బజార్లో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వ్యాపారులకు, ప్రజలకు తెలియజేశారు. కలెక్టర్ వెంట నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.
News September 30, 2025
రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.