News May 15, 2024
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన పోలింగ్.. గెలుపు ఎవరిది…?

ఖమ్మం MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 75.30శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 76.09 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి నామా(BRS) 1,68,062 మెజార్టీతో రేణుకా చౌదరి(INC)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
Similar News
News March 3, 2026
వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
News March 3, 2026
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.
News March 3, 2026
ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్ జీవన్ మిషన్’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.


