News May 15, 2024
REWIND-2019: నిజామాబాద్‌లో BJPకి 70,875 ఓట్ల మెజార్టీ!

నిజామాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. కల్వకుంట్ల కవిత (BRS)పై D. అర్వింద్(BJP)70,875 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మధు యాష్కీ గౌడ్ (కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో జీవన్ రెడ్డి(కాంగ్రెస్), D. అర్వింద్(BJP), బాజిరెడ్డి గోవర్ధన్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
Similar News
News March 11, 2026
నవీపేట్: పాఠాలు బోధించిన కలెక్టర్

నవీపేట మండలం మోకన్ పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 10వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధనా సామర్థ్యాన్ని పరిశీలించారు. చక్కగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
News March 11, 2026
జాకోరలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకోరలో విద్యుత్ షాక్‌తో గుట్టమీది గంగాధర్ (36) అనే రైతు మృతి చెందారు. బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద కేబుల్ వైర్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వర్ని ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 11, 2026
MP అర్వింద్ ఆతిథ్యం అద్భుతం: నారా లోకేశ్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆతిథ్యం అద్భుతమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఓ సమ్మిట్ కోస ఢిల్లీ వెళ్లిన లోకేశ్‌ను అర్వింద్ తన ఇంటికి ఆహ్వానించారు. “అద్భుతమైన భోజనం, అంతకు మించిన మంచి స్నేహంతో గడిపిన సమయం చిరస్మరణీయం. మీ ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకం, మీ అభిమానిగా మారిపోయాను” అంటూ విందులో పాల్గొన్న లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.


