News May 15, 2024

WGL, MHBDలో 23,57,331 మంది ఓటేశారు!

image

2019 ఎన్నికలతో పోలిస్తే వరంగల్‌ లోక్‌సభ స్థానంలో 2024లో ఓటింగ్‌ శాతం పెరిగింది. అప్పుడు 63.65% నమోదు కాగా.. ఇప్పుడు 68.86% పోలింగ్ అయింది. మహబూబాబాద్‌లోనూ 2019లో కంటే ఈసారి 2.81% మంది అధికంగా పోలింగ్‌లో పాల్గొనడంతో 71.85% నమోదైంది. ఈ రెండు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. 70.22 శాతంతో 23,57,331 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరి మీరు ఓటేశారా? కామెంట్.

Similar News

News April 25, 2025

WGL: బైకుపై వెళ్తుండగానే గుండెపోటు.. వ్యక్తి మృతి

image

గుండెపోటుతో వ్యక్తి మరణించిన ఘటన <<16198792>>WGL జిల్లాలో<<>> నిన్న జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజుపల్లికి చెందిన యాకయ్య(45) KNR జిల్లాలోని ఓ క్వారీలో పని చేస్తున్నాడు. బాబాయి బిడ్డ పెళ్లికోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి KNR బయల్దేరాడు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. అతడినే బైక్ నడపమని వెనక కూర్చున్నాడు. గవిచర్లకు చేరుకోగానే గుండెపోటుతో మరణించాడు.

News April 25, 2025

వరంగల్: షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

image

వరంగల్ షీటీం పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై ఈరోజు అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వారు విద్యార్థినిలకు వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 25, 2025

ఎనుమాముల మార్కెట్ వ్యాపారులు, రైతులకు ముఖ్య గమనిక

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యాపారులకు, రైతులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సరుకుల బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిర్చి బీటు ఉ.7.05 ని.కు, పత్తి బీటు 8:05 ని.కు, పల్లికాయ ఉ.8:15 ని.కు, పసుపు బీటు 8:30కి, అపరాలు, ధాన్యం బీటు 8:45 ని.కు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం నుంచి 11-06-2025 బుధవారం వరకు ఈ బీటులో మార్పులుంటాయన్నారు.

error: Content is protected !!