News May 15, 2024

AP: జిల్లాల వారీగా పోలింగ్ శాతం (1/2)

image

*అల్లూరి- 70.20 *అనకాపల్లి- 83.84
*అనంతపురం- 79.25 *అన్నమయ్య- 76.23
*బాపట్ల- 84.98 *చిత్తూరు- 82.65
*డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- 83.91 *ఈస్ట్ గోదావరి- 80.94
*ఏలూరు- 83.55 *గుంటూరు- 78.81
*కాకినాడ- 80.31 *కృష్ణా- 84.05
*కర్నూలు- 75.83 *నంద్యాల- 80.92 *ఎన్టీఆర్- 79.68 (మిగిలిన జిల్లాల వివరాలు తర్వాతి ఆర్టికల్‌లో)

Similar News

News January 11, 2025

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.

News January 11, 2025

విజయవాడ వెస్ట్ బైపాస్‌పై వాహనాలకు పర్మిషన్

image

AP: HYD నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్. VJA వెస్ట్ బైపాస్‌పై శుక్రవారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చారు. గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు 30KM బైపాస్ నిర్మాణం 90% పూర్తి కాగా వాహనాలను అనుమతించట్లేదు. సంక్రాంతి రద్దీ సందర్భంగా 2 వైపులా రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. నగరంలోకి ప్రవేశించకుండా బైపాస్ మీద వెళ్తుండటంతో గంటకు పైగా సమయం ఆదా అవుతోంది.

News January 11, 2025

నేతన్నల సంక్షేమానికి అభయహస్తం పథకం

image

TG: రాష్ట్రంలోని చేనేత, జౌళి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168కోట్లతో అభయహస్తం పథకం ప్రకటించింది. నేతన్న పొదుపు నిధి కింద రూ.115Cr కేటాయించింది. చేనేత కార్మికులు ప్రతినెలా తమ జీతంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుంది. కార్మికులు ఏ కారణంతో మరణించినా నామినీకి రూ.5L అందించేందుకు నేతన్న భద్రతకు రూ.9Cr కేటాయించింది. వస్త్ర ఉత్పత్తులకు వేతన మద్దతుకు నేతన్న భరోసా కింద రూ.44Cr వెచ్చించింది.