News May 15, 2024

ఎన్నికల ఫలితాలపై విశాఖలో జోరుగా బెట్టింగ్..!

image

ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంటుంటే.. వారి గెలుపోటములపై పందెంరాయుళ్లు బెట్టింగులు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ విశాఖ సిటీలో TDP జెండా ఎగురవేసింది. ఆ స్థానాల్లో పందేలు జోరందుకున్నాయని టాక్ నడుస్తోంది. హాట్‌సీట్‌గా ఉన్న విశాఖ ఈస్ట్‌లో అభ్యర్థి గెలుపుతో పాటు, మెజార్టీపైనా బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం. అటు విశాఖ MP, పశ్చిమ అభ్యర్థులపైనా ఇదే పరిస్థితి.

Similar News

News April 1, 2026

లిక్కర్ సేల్స్‌లో విశాఖనే టాప్

image

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.2010.95 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 23.63 లక్షలు, బీర్ బాక్సులు19.78 లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1943.58కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై 3శాతం పెరిగాయి.

News April 1, 2026

జిల్లా పరిషత్తు లేని జిల్లాగా విశాఖ..?

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ విభజనపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని 64 గ్రామాలు మినహా మిగతా ప్రాంతం జీవీఎంసీ పరిధిలో ఉంది. ఈ గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే అలా చేస్తే ZPTC, MPTCలు లేని జిల్లాగా మారే పరిస్థితి ఉంది. విలీనం చేయకపోతే ఈ 3 మండలాలతోనే జిల్లా పరిషత్ కొనసాగిస్తారా? అన్నదానిపై అనిశ్చితి నెలకొంది.

News April 1, 2026

జీవీఎంసీకి రికార్డు స్థాయి వసూళ్లు

image

జీవీఎంసీ 2025 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. మొత్తం రూ.620.08 కోట్లు వసూలు చేసి గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.510.15 కోట్లు వసూలు కాగా, ఈసారి సుమారు రూ.109 కోట్లు అధికంగా రావడం విశేషం. ముఖ్యంగా మార్చి 31 లోపు బకాయిలు (అరియర్స్) చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ ప్రకటించడంతో చెల్లింపుదారులు ముందుకు వచ్చారు.