News May 15, 2024

కర్నూలు: రెండు బైకులు ఢీ.. వ్యక్తి స్పాట్‌‌ డెడ్‌

image

తుగ్గలి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మండలంలోని రాంపల్లికి చెందిన బోయ రమేశ్(25) పెండేకల్లు ఆర్ఎస్ నుంచి గ్రామానికి బైక్‌పై వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బోయ నాగరాజు ఎదురుగా రావడంతో అదుపుతప్పి ఢీకొన్నాయి. ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజుకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News March 5, 2026

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

image

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.

News March 5, 2026

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News March 5, 2026

విందులు చేశారు.. పరిశుభ్రత మరిచారు!

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.