News May 15, 2024
విజయనగరం జిల్లాలో 81.06% ఓటింగ్

విజయనగరం జిల్లాలో 81.06% ఓటింగ్ నమోదైంది. జిల్లాలో 15,85,206 మంది ఓటర్లు ఉండగా 12,84,900 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 6,36,609 మంది పురుషులు, 6,48,267 మంది మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10 శాతం పోలింగ్ నమోదవ్వగా.. 6,04,064 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News March 13, 2026
రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి: VZM SP

జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు.
News March 13, 2026
విజయనగరంలో జోయాలుక్కాస్ గ్రాండ్ ఓపెనింగ్

విజయనగరంలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. వినియోగదారులు ఈ షోరూమ్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్చి 29 వరకు తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% ప్రారంభ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గ్రూప్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు.
News March 13, 2026
VZM: ‘అక్షరాంధ్ర పరీక్షకు 99% హాజరు కావాలి’

ఈనెల 15న నిర్వహించనున్న అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99% హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫిరెన్స్ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 1.10 లక్షల మందిని అక్షరాంధ్ర కింద గుర్తించామని, వారందరూ అక్షరాస్యులుగా మారాలని అన్నారు. పరీక్ష అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.


